ధర్మ సందేహాలు

కాకిని కాలజ్ఞాని అంటారు.. కాకి కావ్ కావ్.. అనుటలో అంతరార్థం ఏమిటి?

కాకి పేరు వినగానే సాదారణంగా చాలా మందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల పట్ల మానవుల భావన. కానీ, ‘గ్రహించగలిగితే సృష్టిలోని ప్రతి అణువూ బోధన చేస్తుంది’ అన్న కవి వాక్కులోని పరమార్థం – కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది.

కాకి ఒక నల్లని సాధారణ పక్షి దీన్ని సంస్కృతం లో వాయసం అంటారు. కాకులు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. వీటిని ఎవరూ ప్రత్యేకంగా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా ఇళ్ల పరిసరాల్లోనే మెలగుతుంటాయి. భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది శనిదేవుడి వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ కారణంగా కొన్నిచోట్ల వీటికి పూజలు సైతం చేస్తుంటారు.

ఒకసారి యముడు రావణుడి దుశ్చర్యలకు భయపడి కాకి రూపాన్ని ధరించాడట. అందువల్ల ఇతర దేవతలకు కొద్దో గొప్పో హాని కలిగినా అతడికి ఏ కాలేదట. అందుకు కృతజ్ఞతగా యముడు కాకులకు రెండు వరాలు ఇచ్చాడంటారు. అవేమిటంటే, యుముడు ప్రాణులన్నింటికీ రోగాలను, వాటి ద్వారా మరణాన్ని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించి రక్షణ పొంది నందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావని వరమిచ్చాడట యముడు.

యమ లోకంలో నరక బాధలను అనుభవించే వారి బంధువులు, అలా మరణించినవారికి సమర్పించే భోజనాన్ని (పిండ రూపంలో) కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందనే మరొక వరాన్ని ఇచ్చాడట. అందువల్లనే ఈ నాటికీ పితృకర్మల సమయంలో కాకులకు పిండాలు పెడుతున్నారంటారు పౌరాణికులు.

కాకి అరుపులతో చాలామందికి చిరాకు కలుగుతుంది. కానీ ఆ అరుపుల్లోనే వేదాంత బోధన ఉందని ఒక కవి పద్యరూపంలో చమత్కారంగా చెప్పాడు. జీవితంలో ఏ క్షణాలూ సుస్థిరమైనవి కావు. అంతలోనే సమసి పోతాయి. సంపదలు, వాటివల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు. అవి నశించిపోతాయి.

మేడలు, మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు. అవన్నీ కరిగి పోతాయి. దానికి ఉదాహరణ ఈ గోరీయే అని ఒక సుల్తాన్ గోరీమీద కూర్చుని కాకి అందరికీ బోధన చేస్తోంది’ అని ఒక కవి చక్కగా కాకి అరుపును సమర్ధించాడు.

కావు కావుమని అరిచే కాకి కూతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పిన ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది. కాకి కి ఉన్న ఉపకార గుణం ప్రశంసించ దగ్గదంటారు మానవతా వాదులు.

అందరినీ మైమరపిస్తూ, గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది కాకి అలాగే మానవుడిగా జన్మించి నందువల్ల అవసరమైనప్పుడు తమ సహజమైన మానవీయతను ప్రదర్శించడం కనీస ధర్మం అంటారు. తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా అందరితోనూ పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి కాకులు.

ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను రమ్మని పిలుస్తాయట అవి. ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను, పంచుకునే అలవాటును పెంచుకోవాలంటారు. బోధకులు. కాకులు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

Sai Mohan

Recent Posts

రామ నామ మహత్యం – ఒక చక్కని ఘటన

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రం చిదంబరం యాత్రను పూర్తిచేసుకుని ఆనందతాండవపురం చేరుకున్నారు.…

March 31, 2025

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? మూడు పాయలుగా ఎందుకు అల్లుతారో మీకు తెలుసా ?

మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఆచారానికీ ఒక అర్ధం ఉంటుంది. అందులో మహిళల జడ కూడా ఒక విశిష్టమైన స్థానం…

March 30, 2025

తెలుగు సంవత్సరాల పేర్లు… వాటి అర్థాలు

తెలుగులో సంవత్సరాలకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, ఇవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాయి. ఈ పేర్లు పంచాంగ…

March 30, 2025

మహిమాన్వితమైన శివాలయాలు.. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు

అఖండ భారతావనిలో ఎన్నో విశిష్ట శివాలయాలున్నాయి. వాటిలో మహిమాన్వితమైనవి కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని దేవాలయాలు ఎన్నో విశిష్టతలతో, అంతు…

November 30, 2024

దానం ఎవరికీ ఇవ్వాలి..? ఏమి ఇవ్వాలి ?

నిత్య కర్మల్లో దానం ఒకటి. ఇచ్చి పుచ్చుకోవడాలు లోక సహజం. కానీ దానం అలాంటిది కాదు. దానం అనే పదానికి…

November 29, 2024

గానుగపురం దత్త మందిరం లో పాదుకల దర్శనం..

శ్రీ క్షేత్ర గానుగాపురం ప్రముఖ పుణ్య క్షేత్రం ఎంతో మహిమ గలది.. మహిమాన్వితమైనది. గానుగాపురం సిద్ధ భూమి. ఇక్కడ చేసే…

April 11, 2024