తెలుగులో సంవత్సరాలకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, ఇవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాయి. ఈ పేర్లు పంచాంగ ప్రకారం నిర్ణయించబడతాయి మరియు ప్రతీ సంవత్సరానికి తన ప్రత్యేకత, శుభాశుభ ఫలితాలు ఉంటాయి. ఈ పేర్లకు సంస్కృత మూలం ఉండటంతోపాటు, వీటి అర్థాలు ఆయా సంవత్సరాల్లో జరిగే పరిణామాలను సూచిస్తాయి. ఇప్పుడు 60 సంవత్సరాల పేర్లు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం.
ప్రభవ అంటే… ప్రభవించునది… అంటే… పుట్టుక.
విభవ – వైభవంగా ఉండేది.
శుక్ల… అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
ప్రమోదూత…. ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
ప్రజోత్పత్తి… ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
అంగీరస… అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
శ్రీముఖ… శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
భావ…. భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
యువ…. యువ అనేది బలానికి ప్రతీక.
ధాత… అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
ఈశ్వర… పరమేశ్వరుడు.
బహుధాన్య… సుభిక్షంగా ఉండటం.
ప్రమాది… ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
విక్రమ… విక్రమం కలిగిన వాడు.
వృష … చర్మం.
చిత్రభాను… భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
స్వభాను… స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
తారణ… తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
పార్థివ… పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
వ్యయ… ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.