దేవాలయాలు

మహిమాన్వితమైన శివాలయాలు.. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు

అఖండ భారతావనిలో ఎన్నో విశిష్ట శివాలయాలున్నాయి. వాటిలో మహిమాన్వితమైనవి కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని దేవాలయాలు ఎన్నో విశిష్టతలతో, అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఆ రహస్యాల్ని కనుగొనడం శాస్త్రవేత్తల వల్ల కూడా కాలేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు.. మరి ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరికైనా అది సాధ్యమా..?

ఆ పరమశివుడి మహిమాన్విత దేవాలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మహానంది శివలింగం

మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.

కాశివిశ్వేశ్వర దేవాలయం

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

శ్రీ బుగ్గ రామేశ్వరాలయం

ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

కాళేశ్వరము

కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.

అలంపూర్ బాల బ్రహేశ్వర లింగం

అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

వెయ్యిస్తంభాల గుడి

వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

ద్రాక్షారామం

ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.

భీమవరం సోమేశ్వరుడు

భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు.

కోటప్పకొండ

కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు.

కపోతేశ్వర స్వామి

గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

బైరవకొన

బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

యాగంటి

యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు.

శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము

శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట

సంగమేశ్వరం

కర్నూలు జిల్లా సంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది.

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.

అమర్నాథ్

అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

శివగంగ

కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.

కోపినేశ్వర్

మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

కంచి

కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.

తిరు నాగేశ్వరము

తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.

కిన్నెర కైలాసము

చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.

Sai Mohan

Recent Posts

రామ నామ మహత్యం – ఒక చక్కని ఘటన

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రం చిదంబరం యాత్రను పూర్తిచేసుకుని ఆనందతాండవపురం చేరుకున్నారు.…

March 31, 2025

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? మూడు పాయలుగా ఎందుకు అల్లుతారో మీకు తెలుసా ?

మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఆచారానికీ ఒక అర్ధం ఉంటుంది. అందులో మహిళల జడ కూడా ఒక విశిష్టమైన స్థానం…

March 30, 2025

తెలుగు సంవత్సరాల పేర్లు… వాటి అర్థాలు

తెలుగులో సంవత్సరాలకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, ఇవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాయి. ఈ పేర్లు పంచాంగ…

March 30, 2025

దానం ఎవరికీ ఇవ్వాలి..? ఏమి ఇవ్వాలి ?

నిత్య కర్మల్లో దానం ఒకటి. ఇచ్చి పుచ్చుకోవడాలు లోక సహజం. కానీ దానం అలాంటిది కాదు. దానం అనే పదానికి…

November 29, 2024

కాకిని కాలజ్ఞాని అంటారు.. కాకి కావ్ కావ్.. అనుటలో అంతరార్థం ఏమిటి?

కాకి పేరు వినగానే సాదారణంగా చాలా మందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల…

April 12, 2024

గానుగపురం దత్త మందిరం లో పాదుకల దర్శనం..

శ్రీ క్షేత్ర గానుగాపురం ప్రముఖ పుణ్య క్షేత్రం ఎంతో మహిమ గలది.. మహిమాన్వితమైనది. గానుగాపురం సిద్ధ భూమి. ఇక్కడ చేసే…

April 11, 2024